అందరి ముందు సీతారామయ్యకి క్షమాపణలు చెప్పిన అపర్ణ!
on Apr 1, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-58 లో.. కావ్య దగ్గరికి వచ్చి ఏం మాట్లాడకుండా ఉన్న రాజ్ ని చూసి.. మనసులో మాట్లాడుకుంటే ఎలా తెలుస్తుంది. రాత్రి నీ గదిలో మన మధ్య ఏం జరగలేదు కదా అని రాజ్ అడుగగా... ఎందుకు జరుగలేదు..జరిగిపోయిందని కావ్య చెప్తుంది. దయచేసి నిజం చెప్పు అని రాజ్ అడుగగా... అది జరిగిపోయిందని చెప్తాడు.
నేను రాత్రి జరిగిందాని గురించి చెప్పవా ప్లీజ్ అని అడుగగా.. అంత కుతూహలంగా ఉందా అని కావ్య అడుగుతుంది. మర్యదగా నిజం చెప్పు.. అసలేం జరిగిందని రాజ్ అడుగగా.. ఒక వారం తర్వాత కనపడండి అంతా గుర్తుతెచ్చుకొని చెప్తానని కావ్య అంటుంది. కాసేపు ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అప్పుడే కళ్యాణ్ వచ్చి.. ఏం చేయాలనుకుంటున్నారని అడుగుతాడు. నా కొత్త కవిత్వం వినవా అని తను రాసిన కొత్త కవిత చెప్తుండగా.. రాజ్ ఆపేసి.. ఈ కళావతికి వినిపించు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. మరోవైపు స్వప్న, రాహుల్ వారి గదిలో మాట్లాడుకుంటారు. నేను ఏమి అడిగినా నువ్వు పట్టించుకోవట్లేదని అడుగుతుంది. ఇప్పుడు నేనేం చేయాలని రాహుల్ అడగుతాడు. నేను మా అమ్మతో మాట్లాడతాను అని చెప్పి కనకంకి కాల్ చేసి, బ్యాంక్ నుండి లోన్ ఇప్పిస్తామని చెప్పి మాట్లాడుతుంది స్వప్న.. ఆ తర్వాత కనకం వాళ్ళ అక్కతో కలిసి బంజారాహిల్స్ దుర్గమ్మ గుడికి వెళ్తున్నామని చెప్తుంది కనకం.
దుగ్గిరాల సీతారామయ్య ఇంట్లో వాళ్ళందరని పిలుస్తాడు. రాజ్ నువ్వు గుడికి తీసుకెళ్ళి పూజ జరిపించి, నీ చేతులతో నీ భార్యకి ప్రసాదం తినిపించాలని సీతారామయ్య చెప్తాడు. దాంతో రాజ్ వెంటనే నిల్చొని.. నో.. తాతయ్య ఇప్పటికే ఇష్టం లేని పెళ్ళి చేసుకున్నాను.. ఇక నన్ను ఇబ్బంది పెట్టకండని అడుగుతాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న అపర్ణ.. వాడిని ఇంకా ఇబ్బంది పెట్టకండని అంటుంది. ఇక చాలు ఆపు.. నీకు ఇష్టం లేదని, ఆ ఇష్టాన్ని బలవంతంగా నీ కొడుకుపై రుద్దాలని చూడకు. మీ మామయ్య ముందు నిల్చొని నిర్ణయాలు అమలు చేసేంత పెద్దదానివయ్యావా అపర్ణ.. ఈ ఇంటికి, ఆస్తికి అధిపతి మా ఆయన సీతారామయ్య.. నా భర్తకే ఎదురు సమధానం చెప్తావా? ఇప్పటికిప్పుడు నా భర్తకి, నీ తల్లి కొడుకులు సారీ చెప్పండని రాజ్ వాళ్ళ నానమ్మ అనగా.. రాజ్ సారీ చెప్తాడు. ఆ తర్వాత అపర్ణ క్షమాపణ కోరుతుంది. ఎక్కడివాళ్ళు అక్కడ వెళ్ళండని రాజ్ వాళ్ళ నానమ్మ చెప్తుంది. ఆ తర్వాత కావ్యని రాజ్ పక్కకి తీసుకెళ్ళి నీకు నాతో గుడికి రావడం ఇష్టం లేదని వెళ్ళి తాతయ్య వాళ్ళతో చెప్పు అని రాజ్ అనగా.. నాకు ఎందుకు ఇష్టం లేదని చెప్తాను నీకే ఇష్టం లేదని చెప్తాను అని కావ్య అంటుంది. కాసేపు ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read